175 మందితో వెళుతున్న విమానం.. ఢీకొట్టిన రాబంధు

Update: 2025-06-03 11:18 GMT

చిన్న పక్షి.. విమానానికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఇండిగో విమానానికి అలాంటి ప్రమాదమే తప్పింది. దాదాపు 175 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో ఎయిర్‌బస్‌ 320 విమానాన్ని ఓ రాబందు ఢీ కొట్టింది. దీంతో ఆ విమానాన్ని రాంచీలోని బిస్రా ముండా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని ఓ అధికారి తెలిపారు.


విమానం రాంచీకి దాదాపు 10 నుంచి 12 నాటికల్‌ మైళ్ల దూరంలో 3-4వేల అడుగుల ఎత్తులో ఉండగా పక్షి ఢీకొంది. దీంతో పైలెట్‌ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులతో సహా సిబ్బందికి ఎలాంటి హాని కలుగలేదు. విమానం దెబ్బతిన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు

Tags:    

Similar News