గుంతలో కుక్క-పులి.. ఎక్కడి నుండి వచ్చాయంటే?

కేరళ లోని ఇడుక్కి జిల్లా మయిలాడుమ్పారై వద్ద ఓ ప్రైవేట్ రబ్బరు తోటలో ఒక పులి, ఒక కుక్క తొమ్మిది అడుగుల లోతైన గుంతలో పడిపోయాయి.

Update: 2025-06-09 09:45 GMT

కేరళ లోని ఇడుక్కి జిల్లా మయిలాడుమ్పారై వద్ద ఓ ప్రైవేట్ రబ్బరు తోటలో ఒక పులి, ఒక కుక్క తొమ్మిది అడుగుల లోతైన గుంతలో పడిపోయాయి. పులి కుక్కను తరుముతూ రావడంతో గమనించకుండా గుంతలోకి పడిపోయినట్లుగా భావిస్తూ ఉన్నారు.

తోట యజమాని సన్నీ తన పొలం భద్రతా చర్యలకోసం గుంతను తవ్వించాడు. ఉదయం కుక్క మొరిగిన శబ్దం విని అక్కడకు వెళ్లగా గుంతలో పులి ఉన్నట్టుగా గుర్తించాడు. వెంటనే అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. అటవీ అధికారులు మొదట పులికి మత్తు ఇంజెక్షన్ వేశారు. ఆ తర్వాత కుక్కకు కూడా మత్తు మందు ఇచ్చారు. పులి, కుక్క రెండు మత్తులోకి జారుకున్న తర్వాత వలను ఉపయోగించి బయటకు తీసారు. పులిని పెరియార్ టైగర్ రిజర్వ్‌కు తరలించారు. వన్యప్రాణి వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా, పులికీ కుక్కకూ గాయాలు లేవని నిర్ధారించారు.

Tags:    

Similar News