చిరుత పక్కనే లేగ దూడ గడ్డి తింటూ
కర్ణాటకలోని మైసూరు జిల్లా హెగ్గడదేవనకోటె శివార్లలో చిరుత సంచరిస్తోందని ఫిర్యాదులు వచ్చాయి.
కర్ణాటకలోని మైసూరు జిల్లా హెగ్గడదేవనకోటె శివార్లలో చిరుత సంచరిస్తోందని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అటవీ శాఖ అధికారులు ఓ బోను ఏర్పాటు చేశారు. ఎరగా ఒక లేగ దూడను అందులో పెట్టారు. ఆహారాన్ని వెతుక్కుంటూ వచ్చిన చిరుత ఆ బోనులో పడింది. అయితే చిరుత ఆ దూడను తినకుండా అక్కడే పక్కన కూర్చుంది. అటవీ సిబ్బంది ఉదయాన వచ్చి చూడగా లేగ దూడ చిరుత పక్కనే కూర్చుని గడ్డి తినడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దూడను బయటకు తీసి, మత్తు మందు సాయంతో చిరుతను బంధించి తీసుకువెళ్లారు. దూడను తినకుండా చిరుత ఎందుకో మనసు మార్చుకోవడం విశేషం.