3 కోట్ల రూపాయల సింగం

రాజస్థాన్‌లోని సీకర్‌లో నిర్వహిస్తున్న పశువుల సంతలో ఓ దున్నపోతు కోట్ల రూపాయలు పలికింది.

Update: 2025-08-12 10:30 GMT

3 కోట్ల రూపాయల సింగం

రాజస్థాన్‌లోని సీకర్‌లో నిర్వహిస్తున్న పశువుల సంతలో ఓ దున్నపోతు కోట్ల రూపాయలు పలికింది. ముర్రా జాతికి చెందిన దున్నపోతు పేరు సింగం. యజమాని డాక్టర్‌ ముకేశ్‌ దుద్‌వాల్‌ దీన్ని పెంచుకుంటున్నారు. సంతలో ఒక బృందం ఈ దున్నకు ఏకంగా 3 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. 34 నెలల వయసున్న ఈ దున్నపోతును విక్రయించేందుకు ముకేశ్‌ ఇష్టపడటం లేదు. ఇంకో విషయం ఏమిటంటే సింగం వీర్యం అమ్మకం ద్వారానే ఆయనకు ఏటా కోటి రూపాయల ఆదాయం వస్తోంది. గతంలో సింగం తండ్రికి 24 కోట్ల రూపాయల ధర పలికిందట. రాబోయే రోజుల్లో సింగంను సొంతం చేసుకోడానికి మరింత మంది పోటీ పడొచ్చు.

Tags:    

Similar News