90 చేపలు.. కోటి రూపాయలు
ఇష్టమైన చేపలు వండుకుని తినడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు కొందరు.
ఇష్టమైన చేపలు వండుకుని తినడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు కొందరు. అదే ఔషధ తయారీలో ఉపయోగించే చేపల కోసమైతే లక్షలు పెట్టడానికి ముందుకు వస్తుంటాయి ఫార్మా కంపెనీలు. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా జలేశ్వర్ ప్రాంతానికి చెందిన లక్కు కలిసొచ్చింది. చేపల వేటకు వెళ్లిన కొంతమంది మత్స్యకారులకు అరుదైన తెలియా భోళా చేపలు 90 దాకా దొరికాయి. ఆదివారం వీటిని వేలం వేయగా ఓ కంపెనీ ప్రతినిధులు కోటి రూపాయలకి దక్కించుకున్నారు. ఒక్కో చేప బరువు 30-35 కిలోలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వీటిని ఔషధాల తయారీలో వాడుతూ ఉండడంతో ఇంత ధర పలికింది.