దినకూలీకి అదృష్టం కలిసొచ్చింది. ఒక్క వజ్రం దొరికితే చాలు బతుకులు మారిపోతాయని అనుకుంటూ ఉంటే, ఆ కూలీకి ఏకంగా 8 వజ్రాలు దొరికాయి. దీంతో అతడి ఆనందం అంతా ఇంతా కాదు.
మధ్యప్రదేశ్‌లోని పన్నాలో హర్‌గోవింద్ యాదవ్ అనే దినకూలీకి నిసార్ గనిలో 8 వజ్రాలు దొరికాయి. వాటి ధర సుమారు 12 లక్షలు ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. ఛతర్‌పుర్ జిల్లాలోని కటియా గ్రామానికి చెందిన హర్‌గోవింద్, పవన్‌దేవి గత అయిదేళ్లుగా నిసార్ గనిలో పనిచేస్తున్నారు. ఒకేసారి ఈ దంపతులకు 8 వజ్రాలు లభించాయి. వీటి విలువను నిపుణులు నిర్ధారించాక, వేలంలో వచ్చిన మొత్తం నుంచి పన్నులు మినహాయించి మిగతా డబ్బును గోవింద్ కుటుంబానికి అందజేస్తారు. గతంలోనూ తనకు ఓ వజ్రం దొరికిందని హర్‌గోవింద్ తెలిపారు.