ఆ ఊళ్ళో ఒకేసారి 40 మంది గుండు చేయించుకున్నారు
వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత ఒక మహిళ కుటుంబంలోని నలభై మంది కుటుంబ సభ్యులు గుండు చేయించుకున్నారు.
వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత ఒక మహిళ కుటుంబంలోని నలభై మంది కుటుంబ సభ్యులు గుండు చేయించుకున్నారు. కులాంతర వివాహం కారణంగా ఆ కుటుంబాన్ని బహిష్కరించారు. రాయగడ జిల్లాలోని కాశీపూర్ బ్లాక్‌లోని బైగనగూడ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. షెడ్యూల్డ్ తెగ వర్గానికి చెందిన ఆ మహిళ ఇటీవల పొరుగు గ్రామానికి చెందిన షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ వివాహం గ్రామస్తులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీంతో వారు ఆ కుటుంబాన్ని బహిష్కరించారు. ఆ మహిళ కుటుంబాన్ని తిరిగి సమాజంలోకి చేర్చుకోవాలనుకుంటే కొన్ని శుద్ధి కార్యక్రమాలను నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించకపోతే, నిరవధిక సామాజిక బహిష్కరణ చేస్తామని గ్రామస్తులు కుటుంబాన్ని హెచ్చరించారు. దీంతో చివరికి గుండు కొట్టించుకోవాల్సి వచ్చింది.