3 కోట్ల IRCTC ఖాతాలకు దెబ్బ
తత్కాల్ టికెట్ల జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది.
తత్కాల్ టికెట్ల జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. తాజాగా ఐఆర్‌సీటీసీ ఖాతాల ఏరివేతను మొదలెట్టింది. ఈ ఏడాదిలో జనవరి నుంచి ఇప్పటి వరకు 3.02 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సామాన్యులకు సాధారణ, తత్కాల్ టికెట్లు అందేలా రిజర్వేషన్ వ్యవస్థ తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. తత్కాల్ వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఆధార్ బేస్డ్ ఓటీపీ వ్యవస్థను దశలవారీగా అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.