ఒక్క రోజు పని చేయకపోయినా 26 లక్షల జీతం
ఒక్క రోజూ కూడా పనిచేయని ఉద్యోగికి ఒక కంపెనీ ఏకంగా 26 లక్షల రూపాయల జీతం చెల్లించాల్సి వచ్చింది.
ఒక్క రోజూ కూడా పనిచేయని ఉద్యోగికి ఒక కంపెనీ ఏకంగా 26 లక్షల రూపాయల జీతం చెల్లించాల్సి వచ్చింది. అబుదాభికి చెందిన కంపెనీలో ఒక ఉద్యోగికి ఆఫర్ లెటర్ వచ్చింది. అయితే ఉద్యోగం మొదలు పెట్టడానికి కంపెనీ ఒప్పుకోలేదు, జీతం కూడా ఇవ్వలేదు. తనకు 2024 నవంబరు 11 నుంచి 2025 ఏప్రిల్ 7 వరకు జీతం నిలిపివేశారంటూ కోర్టుకెక్కాడు. కంపెనీలో తనకు బేసిక్ శాలరీ 7,200 యూఏఈ దీనార్లు కాగా, మొత్తం నెలకు 24 వేల దీనార్ల ప్యాకేజీ లభించిందని కోర్టుకు ఆ ఉద్యోగి తెలియజేశారు. డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన కోర్టు ఉద్యోగం మొదలు పెట్టడంలో అయిన ఆలస్యం కంపెనీదే అని స్పష్టంగా తెలుస్తోందని అభిప్రాయపడింది. దీంతో మొత్తం నాలుగు నెలల 18 రోజుల పనికిగానూ 1 లక్షా 10 వేలా 400 దీనార్లు చెల్లించాలని ఆ కంపెనీని కోర్టు ఆదేశించింది. అంటే భారత కరెన్సీలో 26 లక్షలన్నమాట.