ఆడబిడ్డ పెళ్లికి 25000 గృహ ప్రవేశానికి 10000
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ సర్పంచ్ గా పోటీ చేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావు ప్రజలపై వరాల జల్లు కురిపించారు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ సర్పంచ్ గా పోటీ చేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావు ప్రజలపై వరాల జల్లు కురిపించారు. తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలోని పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 25 వేల 116 రూపాయలు పేదల గృహప్రవేశానికి 10 వేల 116 రూపాయలు అందచేస్తానని ప్రకటించారు. పేదిళ్లలో ఆడబిడ్డ ప్రసవానికి కూడా డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చారు. పురుషులు, మహిళా వ్యవసాయ కూలీలకు సొంత డబ్బుతో ప్రమాద బీమా చేయిస్తానని, అనారోగ్యంతో అత్యవసర చికిత్స అవసరమైన వారికి 5000 నుంచి 10000 రూపాయలు అందిస్తానని తెలిపారు. 100 రూపాయల బాండ్ పేపర్ తయారు చేయించి మరీ ఈ హామీల వర్షం కురిపించారు.