పెయింట్ షాపులో ఉద్యోగి 25 కోట్లు

పెయింట్ షాపులో పని చేసుకునే వ్యక్తికి లాటరీలో 25 కోట్ల రూపాయలు దక్కాయి.

Update: 2025-10-07 14:00 GMT

పెయింట్ షాపులో పని చేసుకునే వ్యక్తికి లాటరీలో 25 కోట్ల రూపాయలు దక్కాయి. కేరళ రాష్ట్రంలో లాటరీల శాఖ నిర్వహించే ఓణం బంపర్ లాటరీలో శరత్ నాయర్ అనే వ్యక్తి 25 కోట్లు గెలుచుకున్నాడు. శరత్ నాయర్ స్వస్థలం అలప్పుజలోని తురవూర్. గత 12 సంవత్సరాలుగా అతడు ఓ పెయింట్ల దుకాణంలో పని చేస్తున్నాడు. ఈక్రమంలో కొన్ని రోజుల క్రితం అతడు కేరళ రాష్ట్ర లాటరీల శాఖ నిర్వహించే ఓణం బంపర్ లాటరీలో టికెట్టు కొనుగోలు చేశాడు. ఈ లాటరీకి సంబంధించిన ఫలితాల్లో శరత్ నాయర్ కొనుగోలు చేసిన టికెట్ బపర్ లాటరీ గెలిచినట్లు తెలిసింది. ఈ మొత్తం డబ్బుతో ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని, ముందుగా తనకున్న అప్పులు తీర్చేసి ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై కుటుంబ సభ్యలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని శరత్ నాయర్ తెలిపారు.

Tags:    

Similar News