ఆమె వయసు 23 సంవత్సరాలు.. ఎంతో జోష్ తో డ్యాన్స్ చేస్తూ ఉండగా!!

తన కజిన్‌ సోదరి పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తూ ఉండగా ఒక్కసారిగా

Update: 2025-02-10 09:01 GMT

మధ్యప్రదేశ్‌లోని విదిషాలో 23 ఏళ్ల యువతి తన కజిన్‌ సోదరి పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె గుండెపోటుతో మృతి చెందింది. బాధితురాలు పరిణీతా జైన్ వివాహానికి హాజరయ్యేందుకు ఇండోర్ నుంచి విదిషాకు వచ్చింది. పరిణీతా జైన్ దాదాపు రెండు నిమిషాల పాటు వివాహానికి ముందు జరిగిన సంగీత్ వేడుకలో ప్రముఖ హిందీ పాటలకు వేదికపై నృత్యం చేస్తూ కనిపించారు.

'శరరా శరరా' పాట ప్లే అవుతుండగా ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంది. ఇంతలో ఆ అమ్మాయి కుప్పకూలిపోయింది. వేదికపై పడిపోయింది. తొలుత జైన్ స్పృహతప్పి పడిపోయిందని భావించి ఫంక్షన్‌కు హాజరైన బంధువులు కంగారు పడ్డారు. కానీ ఆమెలో ఎలాంటి కదలిక లేకపోవడంతో వారు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. గుండెపోటుతో ఆమె మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు


Tags:    

Similar News