20000 రాఖీలు కట్టించుకున్నారు

ఉత్తర ప్రదేశ్, బరేలీ మేయర్ డాక్టర్ ఉమేష్ గౌతమ్ రక్షా బంధన్‌ను పురష్కరించుకుని మహిళలతో రాఖీలు కట్టించుకున్నారు.

Update: 2025-08-09 08:23 GMT

ఉత్తర ప్రదేశ్, బరేలీ మేయర్ డాక్టర్ ఉమేష్ గౌతమ్ రక్షా బంధన్‌ను పురష్కరించుకుని మహిళలతో రాఖీలు కట్టించుకున్నారు. గత మూడు రోజుల్లో ఆయన ఏకంగా 20 వేల మంది మహిళలతో రాఖీలు కట్టించుకున్నారు. ఎక్కువ రాఖీలు కట్టించుకున్న వ్యక్తిగా రికార్డు సైతం సృష్టించారు. ఇక రాఖీలు కట్టిన మహిళలకు రిటర్న్ గిఫ్ట్‌గా పలు హామీలు ఇచ్చారు. స్పెషల్ హెల్త్ కార్డ్ ద్వారా మిషన్ హస్పిటల్‌లో ఉచిత వైద్యం అందిస్తానని, ఇంటర్ వరకు ఉచిత విద్యను అందిస్తానని చెప్పారు. రేషన్ కార్డులు లేని వారికి కూడా నెల నెలా రేషన్ అందిస్తానని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News