15 రూపాయలతో మీ ఒంట్లో ఏమి జరుగుతోందో చెప్పేస్తుంది

హైదరాబాద్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పరిశోధకులు రక్తం, చెమట, మూత్రం, కణాల నుండి జీవక్రియలను ఐదు నిమిషాల్లోపు గుర్తించగల బయోసెన్సర్‌ను అభివృద్ధి చేశారు.

Update: 2025-06-23 08:45 GMT

హైదరాబాద్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పరిశోధకులు రక్తం, చెమట, మూత్రం, కణాల నుండి జీవక్రియలను ఐదు నిమిషాల్లోపు గుర్తించగల బయోసెన్సర్‌ను అభివృద్ధి చేశారు. తక్కువ ఖర్చుతో కూడిన ఈ ఆవిష్కరణ డయాబెటిక్ కార్డియోమయోపతి వంటి విషయాలను పర్యవేక్షించడంలో సహాయపడుతుంది. ఈ పరికరం చెమట, మూత్రం నుండి గ్లూకోజ్, లాక్టేట్ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. రీసెర్చ్ స్కాలర్ సోనాల్ ఫండే నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసిన ఈ సెన్సార్ ధర కేవలం 15 రూపాయలు మాత్రమే. ముఖ్యంగా సాంప్రదాయ రక్త పరీక్షలకు సూది ఉపయోగం లేకుండా ప్రత్యామ్నాయంగా మారనుంది. ఇది డయాబెటిస్ రోగుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి సహాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు.

Tags:    

Similar News