ఆ తోడేళ్లతో 12 గ్రామాలకు నిద్ర లేదు
సాధారణంగా ప్రజలను చూస్తే దూరంగా ఉండే తోడేళ్లు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో రెచ్చిపోతున్నాయి.
తోడేళ్ళు కొన్ని గ్రామాలను వణికిస్తున్నాయి. సాధారణంగా ప్రజలను చూస్తే దూరంగా ఉండే తోడేళ్లు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో రెచ్చిపోతున్నాయి. కైసర్‌గంజ్, మహసీ తహసీళ్ల పరిధిలో పన్నెండు గ్రామాల ప్రజలను రెండేళ్లుగా తోడేళ్లు భయపెడుతున్నాయి. గత ఇరవై రోజుల్లో 11 సార్లు గ్రామస్థులపై దాడి చేశాయి. ఈ దాడుల్లో ఇద్దరు బాలికలు మృతిచెందగా, 9 మంది గాయపడ్డారు. ఆపరేషన్ వూల్ఫ్‌లో భాగంగా తోడేళ్ల పట్టివేతకు పోలీసులు, అటవీ సిబ్బంది, ఇతర రాష్ట్రాల నిపుణులతో కూడిన బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.