Breaking : జగన్ కు షాకింగ్ న్యూస్...ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రాజీనామా
వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళిగిరి ఎమ్మెల్యే ఆళ్ల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
Alla ramakrishna reddy
వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకుననారు. మంగళిగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో పాటు పార్టీ కి కూడా ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా వైసీపీ లో సంచలనం రేకెత్తించింది. ఆళ్ల పార్టీకి, ఎమ్మెల్యే పదవికి అసంతృప్తితో రాజీనామా చేసినట్లు తెలిసింది. ఆయన 2014, 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కొంతకాలంగా పార్టీ అధినాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారు.
ఎన్నికల సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి తీసుకున్న నిర్ణయం పార్టీలో నిజంగా సంచలనమే. ఎందుకంటే జగన్ కు అత్యంత దగ్గరయిన ఆళ్ల రాజీనామా చేయడం పార్టీలో ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి టిక్కెట్ ను బీసీలకు ఇస్తారని ప్రచారం జరుగుతుండటం, తన ప్రమేయం లేకుండానే మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు జరుగుతుండటంతో ఆయన కలత చెందినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే ఆళ్లను రాజీనామా ఉపసంహరించుకోవాలని పార్టీ హైకమాండ్ ఎలాంటి చర్యలకు అయినా దిగుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.