Iran and Israel War : ఇరాన్ - ఇజ్రాయిల్ తొమ్మిది రోజుల యుద్ధం.. నష్టం ఎన్ని వేల కోట్ల రూపాయలో తెలుసా?

ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మరింత తీవ్రమయింది. గత తొమ్మిది రోజులుగా ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది

Update: 2025-06-21 03:51 GMT

ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మరింత తీవ్రమయింది. గత తొమ్మిది రోజులుగా ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో వందల సంఖ్యలో పౌరులు ఇరు దేశాలకు చెందిన వారు మరణించారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. ఇక అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఆస్తుల విధ్వంసం వెల కట్టలేని పరిస్థితుల్లో ఉందనే చెప్పాలి. ఇరుదేశాలు కసితో ఒకరిపై ఒకరికి దాడులకు దిగుతుండటంతో అంతర్జాతీయ సమాజంలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇరు దేశాల మధ్య సంధి చేసే ప్రయత్నాలు కూడా జరగడం లేదు. జెనివాలో చర్చల ప్రక్రియ జరుగుతున్నా ఎవరూ వెనకడుగు వేయడం లేదు. క్షిపణులు, బాంబుల మోతలతో ఇరు దేశాల్లోని ప్రధాన నగరాలు దద్దరిల్లిపోతున్నాయి. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారన్న టెన్షన్ అందరికీ ఉంది.

ప్రధాన నగరాలపై...
ఇరు దేశాల గగనతలంపై విమానాల రాకపోకలపై నిషేధం విధించారు. ఇరాన్ ఇజ్రాయిల్ లోని హైఫా, బీర్ షిబా, టెల్ అవీవ్ పై క్షిపణులతో దాడులకు దిగింది. దీనికి ప్రతిగా ఇరాన్ పైకి ఇజ్రాయిల్ యుద్ధ విమానాలను పంపిది. ఇరాన్ రక్షణ పరిశోధన కేంద్రం కూడా ధ్వంసమయింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతోఇరాన్ విరుచుకుపడుతుండటంతో ఇజ్రాయిల్ కూడా తీవ్రంగానే నష్టపోయింది. ప్రధాన నగరాలైన టెల్ అవీవ్, హైఫా, బీర్ షిబాద నగరాల్లో దాడులు జరగపడంతో అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. అయితే ప్రాణ నష్టం ఎంత జరిగిందన్నది అధికారికంగా కొంత వరకు మాత్రమే ప్రకటించారు. వాస్తవ లెక్కలు బాహ్య ప్రపంచానికి తెలియడం లేదు.
యుద్ధ విమానాలతో...
ఇరాన్ - ఇజ్రాయిల్ రెండు దేశాలు తమదే పై చేయి అని చెప్పుకోవడానికి జరిగిన నష్టం అంచనాలు బయటకు చెప్పడం లేదు కానీ భారీగానే ఇరుదేశాలు నష్టపోయినట్లు తెలుస్తోంది. రెండు దేశాల్లోని ప్రధాన నగరాల్లో పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకునే పరిస్థితులు ఉన్నాయంటే ఏ మేరకు దాడులు నిత్యం జరుగుతున్నాయో వేరే చెప్పాల్సిన పనిలేదు. పశ్చిమ ఇరాన్ లోని కెర్మన్ షా, తబ్రీజ్ ప్రాంతాల్లో ఉన్న బాలిస్టిక్ క్షిపణుల కేంద్రాలపై ఇజ్రాయిల్ తమ యుద్ధ విమానాలతో దాడులు చేసింది. ఆ కేంద్రాలను ధ్వంసం చేసింది. రాస్త్ నగరంపై కూడా బాంబులు వర్షం కురవడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. మరి ఎంత నష్టమన్నది తెలియకున్నా వేల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లి ఉంటుందన్న అంచనాలు వినపడుతున్నాయి.
Tags:    

Similar News