72 గంటల్లో లొంగిపోండి.. ఇరాన్ హెచ్చరికలు

ఇరాన్ లో నిరసనలు కొనసాగుతున్నాయి.

Update: 2026-01-21 04:05 GMT

ఇరాన్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి తమ ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీగా వీధుల్లోకి వస్తున్నారు. దీంతో ప్రభుత్వం నిరసనకారులకు ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. 72 గంటల్లోగా లొంగిపోవాలని, లేదంటే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నేషనల్ పోలీస్ చీఫ్ అహ్మద్ రెజా హెచ్చరించారు.

మోసపోయిన వారిగా...
అల్లర్లలో పాల్గొన్న యువకులను శత్రు సైనికులుగా కాకుండా మోసపోయిన వారిగా పరిగణిస్తామని చెప్పారు. గడువులోగా సరెండర్ అయితే వారిపై దయతో వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. రెండు వారాలుగా ఇరాన్ లో జరుగుతున్న నిరసనల్లో వేలాది మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయినా సరే ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.


Tags:    

Similar News