Iran : అట్టుడికిపోతున్నఇరాన్.. ఇప్పటికే వందల సంఖ్యలో మృతి
ఇరాన్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి
ఇరాన్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వారం రోజుల నుంచి వీధుల్లోకి వచ్చిన జనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలపై అక్కడి ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించే సంకేతాలు ఇచ్చింది. నిరసనల్లో పాల్గొనే వారిని ‘దేవుడికి శత్రువులు’గా పరిగణిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవహెదీ అజాద్ హెచ్చరించారు. ఈ అభియోగానికి మరణశిక్ష కూడా ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు.ఇరాన్ లో ఇప్పటికే నిరసనల కారణంగా వందల సంఖ్యలో మరణించారని తెలిసింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఇరాన్ వీధులన్నీ దద్దరిల్లుతున్నాయి. ప్రభుత్వానికివ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
శత్రువులుగా పరిగణిస్తామంటూ...
నిరసనలు పాల్గొనే వారిని దేవుడి శత్రువులుగా పరిగణిస్తామని ఇారాన్ అటార్నీ జనరల్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది. ఇప్పటికే దేశ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ వరకు నిరసనలపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2,500 మంది నిరసనకారులను సైన్యం అదుపులోకి తీసుకుంది. దాదాపు రెండు వారాలుగా కొనసాగుతున్న ఈ ఆందోళనలు ఇటీవల మరింత తీవ్రతరంగా మారాయి.
అమెరికా హెచ్చరికలను సయితం...
విభేద స్వరాలపై విస్తృత స్థాయిలో అణచివేత చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరొకవైపు ఇరాన్ లో ఆందోళనలు చేస్తున్న వారికి అమెరికా మద్దతుగా నిలుస్తుంది. తాము ప్రజలకు అండగా ఉంటామని వాషింగ్టన్ ప్రకటించింది. మరొకవైపు ఇరాన్ కు అమెరికా విదేశాంగా శాఖ హెచ్చరికలు జారీ చేసింది ట్రంప్ తో ఆటలాడొద్దని, ఆయన ఎప్పుడైనా చెబితే చేస్తారని ప్రకటించారు. కానీ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖొమైనా లెక్కచేయడం లేదు. తాము నిరసనలను అణిచివేసేందుకు కఠిన చర్యలు తీసుకంటామని హెచ్చరించడంతో 31 రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్ర తరమవుతున్నాయి.