Train Accident : ఘోర రైలు ప్రమాదం.. 22 మంది మృతి

థాయ్ లాండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇరవై రెండు మంది మరణించారు

Update: 2026-01-14 06:24 GMT

థాయ్ లాండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇరవై రెండు మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. థాయ్‌లాండ్ ఈశాన్య ప్రాంతంలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు ఉపయోగిస్తున్న భారీ క్రేన్‌ ఒక్కసారిగా కూలి, ప్రయాణికులతో వెళ్తున్న రైలుపై పడింది. ఈ ఘటనలో రైలు పట్టాలు తప్పి మంటలు చెలరేగాయి. కనీసం 22 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. నఖోన్ రాచసీమా ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది.

క్రేన్ కూలడంతో...
బ్యాంకాక్ నుంచి ఉబోన్ రాచథానీ ప్రావిన్స్‌కు వెళ్తున్న రైలు, ఎత్తైన హైస్పీడ్ రైల్వే మార్గం కిందుగా వెళ్లే సమయంలో క్రేన్‌ కూలిందని అక్కడి పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. క్రేన్‌ రైలుపై పడడంతో బోగీలు పట్టాలు తప్పి, కొన్నింటికి మంటలు అంటుకున్నాయి. అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తెచ్చామని, బోగీల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. రైల్లో మొత్తం 195 మంది ప్రయాణికులు ఉన్నారని థాయ్‌లాండ్ రవాణా శాఖ మంత్రి పిపాట్ రాచకిట్‌ప్రకాన్ చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్టు వెల్లడించారు.


Tags:    

Similar News