గ్రీన్ లాండ్ ను గుప్పిట్లో తీసుకోవడానికి ట్రంప్ ప్రయత్నం
గ్రీన్ లాండ్ ను కైవసం చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు
గ్రీన్ లాండ్ ను కైవసం చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. గ్రీన్ లాండ్ తమకే దక్కాలని చెబుతున్నారు. లేకుంటే గ్రీన్ లాండ్ ను రష్యా, చైనాలు వశపర్చుకుంటాయని చెప్పారు. ఇంకొక మాటకు తావు లేకుండా గ్రీన్ లాండ్ ను తాము స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ తెలిపారు. అమెరికా జాతీయ భద్రత దృష్ట్యా గ్రీన్ లాండ్ అవసరం తమకు మాత్రమే ఉందని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. ఇందుకు నాటో సభ్య దేశాలు కూడా చొరవ చూపాలంటూ కోరారు. లేకపోతే గ్రీన్ లాండ్ ను రష్యా, చైనా ఆక్రమించుకుంటాయని తెలిపారు.
నిర్లక్ష్యం చేశారంటూ...
గ్రీన్‌లాండ్ రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేశారంటూ అమెరికా విమర్శలు చేసిన నేపథ్యంలో, ఆర్కిటిక్ ప్రాంతంలోని గ్రీన్‌లాండ్‌లో తమ సైనిక ఉనికిని మరింత బలపరుస్తామని డెన్మార్క్ ప్రకటించింది. ఈ మేరకు డెన్మార్క్ రక్షణ మంత్రి ట్రోల్స్ లుండ్ పౌల్సెన్ బుధవారం తెలిపారు. “గ్రీన్‌లాండ్‌లో మా సైనిక ఉనికిని ఇంకా పెంచుతాం. అదే సమయంలో నాటో పరిధిలో ఎక్కువ వ్యాయామాలు, ఆర్క్టిక్‌లో నాటో ఉనికి పెంచడంపై ప్రత్యేక దృష్టి పెడతాం” అని పౌల్సెన్ ఏఎఫ్‌పీకి ఇచ్చిన ప్రకటనలో చెప్పారు. గ్రీన్ లాండ్ లో సైనిక బలగాలను పెంచారు.
నాటోతో కొనసాగేందుకు...
గ్రీన్‌లాండ్ భవిష్యత్‌పై చర్చించేందుకు వైట్ హౌస్‌లో గ్రీన్‌లాండ్, డెన్మార్క్, అమెరికా అధికారుల సమావేశానికి కొన్ని గంటల ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2026లో కొత్త కార్యక్రమాలు, విస్తృత కార్యకలాపాలపై నాటో మిత్రదేశాలతో ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నాయని పౌల్సెన్ తెలిపారు. ఆర్కిటిక్ భద్రతపై మిత్రదేశాల సమన్వయం మరింత పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. మొత్తం మీద డెన్కార్క్ పై ట్రంప్ మనసు మారుతుందేమోనని చూసిన గ్రీన్ లాండ్ ఎప్పటికీ నాటో పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.