భార‌త్ కు అమెరికా అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏంటంటే..

బైడెన్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో భార‌త్ తోపాటు ఆమెరికా సంస్థ‌లకు ఊర‌ట ల‌భించిన‌ట్లైంది. అమెరికా సంస్థ‌ల వ‌ర్క్ కు..

Update: 2022-05-05 12:22 GMT

న్యూఢిల్లీ : ప్ర‌పంచ పెద్ద‌న్న, అగ్ర‌రాజ్యం అమెరికా భారత్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే అమెరికా వెళ్లి అక్కడ పని చేయాలని ఎంతో మంది ఉవ్విల్లూరుతుంటారు. అమెరికాకు వెల‌స వెళ్లి ప‌నిచేస్తున్న, ముఖ్యంగా వేలాది మంది భారతీయులకు బైడెన్ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రీన్ కార్డుపై అమెరికాలో ఉన్న వారికి వ‌ర్క్ ప‌ర్మిష‌న్ గ‌డువు పొడిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది అగ్ర‌రాజ్యం అమెరికా. దీంతో ఎంతో మంది భార‌తీయుల‌కు ఊర‌ట ల‌భించిన‌ట్లైంది.. క‌రోనా స‌మ‌యంలో కొంత కాలంగా ప‌ర్మిష‌న్ పొడిగించే విష‌యంలో కాస్త ఆల‌స్యం కావ‌డంతో భార‌తీయులు ఆందోళ‌న చెందారు.. అయితే రెండేళ్ల ఒక‌సారి 18 నెలలు వ‌ర్క్ ప‌ర్మిట్ల గ‌డువు పొడిగిస్తూ వ‌స్తుంది అమెరికా.

ప్ర‌స్తుతం ఉన్న‌ గ‌డువు 180 రోజులు కాగా.. తాజాగా మ‌రో 18 నెల‌లు పాటు గ‌డువు పెంచ‌డంతో ఇది కాస్త 540 రోజులుకు చేరుకుంది. దీంతో అమెరికా గ్రీన్ కార్డు కోసం నిరీక్షిస్తున్న వారికి, హెచ్-1బి వీసాదారుల భాగస్వాములకు ఇది ఉప‌యోప‌గ‌డ‌నుంది. బైడెన్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో భార‌త్ తోపాటు ఆమెరికా సంస్థ‌లకు ఊర‌ట ల‌భించిన‌ట్లైంది. అమెరికా సంస్థ‌ల వ‌ర్క్ కు ఎలాంటి అంత‌రాయం ఏర్ప‌డ‌క‌పోవ‌డంతో సంస్థ యాజ‌మాన్యాలు సైతం గూడ్ న్యూస్ గానే భావిస్తున్నాయి. అమెరికాలో వ‌ర్క్ ప‌ర్మిట్ల‌ను సాధార‌ణంగా 180 రోజుల‌కు ఒక‌సారి ఆటోమేటిగ్గా పొడిగిస్తారు. కానీ ఇప్పుడు ఏకంగా 18 నెల‌లు పొడిగించారు. దీంతో 180 రోజులు గ‌డువు పొడిగింపులో ఉన్న‌వారికి మ‌రో సంవ‌త్స‌రం పాటు అక్క‌డ ఉద్యోగం చేసుకునేందుకు అవ‌కాశం ల‌భించిన‌ట్లైంది. ఎంతో కాలంగా భార‌తీయులు వ‌ర్క్ ప‌ర్మిట్ల గ‌డువు ఎప్పుడు పొడిగిస్తారా అని ఎదురుచూశారు. 180 రోజులు స్వ‌ల్ప స‌మ‌య‌మ‌ని అది స‌రిపోవ‌డం లేద‌ని భార‌తీయులు వాపోయారు. భార‌త ప్ర‌భుత్వం సైతం వ‌ర్క్ ప‌ర్మిట్ల అడువును మ‌రింత పెంచాల‌ని ప‌లు మార్లు కోరింది.
ఇప్పుడు అమెరికా స్పందిస్తూ.. (ఈఏడీ)లకు ఉన్న 180 రోజుల ప్రస్తుత ఆటోమేటిక్ పొడిగింపు సరిపోవడం లేద‌ని అందువ‌ల్ల‌నే ప్ర‌స్తుతం వ్యవధిని పెంచ‌డం జ‌రిగింద‌ని అమెరికా పౌరసత్వ, వలసల సేవల విభాగం తెలిపింది. దీనికి తోడు ఇప్ప‌టికే యంప్లాయ్ మెంట్ ఆథరైజేషన్ కార్డు రెన్యూవల్ కు రోజురోజు దరఖాస్తులు సంఖ్య భారీగా పెరుగుతుండ‌డంతోనే ఈ కీల‌క నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఎంతో మందికి ఉపాధి ల‌భించ‌డంతోపాటు అమెరికాలో ఉద్యోగుల కొర‌త లేకుండా ఉంటుంద‌ని బైడెన్ స‌ర్కార్ తెలిపింది. అమెరికా ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఎంతో మంది ఉద్యోగుల‌తోపాటు, వ‌ల‌స‌దారుల‌కు ఊర‌ట ల‌భించ‌నుంది. అయితే ఈ నిర్ణయంతో దాదాపు 87వేల మంది వలసదారులకు తక్షణమే లబ్ధి చేకూరడంతో పాటు దాదాపు నాలుగు ల‌క్ష‌ల ఇర‌వై వేల మంది ఉద్యోగ అనుమ‌తులు కోల్పోకుండా ఉంటారని ప‌లువురు అధికారులు పేర్కొంటున్నారు.


Tags:    

Similar News