సిగిరెట్ మానేయడానికి ఈయన ఏం చేశాడో తెలుసా?

టర్కిష్ వ్యక్తి ఒకరు స్మోకింగ్ ను మానేయడానికి విచిత్రమైన పరిస్థితులను తనకు తానే సృష్టించుకున్నాడు

Update: 2025-01-24 07:12 GMT

సిగిరెట్ మానడం అంత సలువు కాదు. అదొక వ్యసనం. ధూమపానం వల్ల అనేక రోగాలు వస్తాయని తెలిసి కూడా దానిని మానుకోలేకపోతున్నారు. అదొక బలహీనత అని చెప్పుకోవాలి. సిగిరెట్ తాగకుంటే ఏదో వెలితి అని అనిపిస్తుందట. అందుకే ఎక్కువ మంది స్మోకింగ్ ఫ్యాషన్ తో ప్రారంభమై వ్యసనంగా మార్చుకుంటున్నారు. అయినా దానిని మానేయాలంటే అందరికీ సాధ్యపడదు. మనసు నిర్మలంగా, బతకాలని కోరిక బలీయంగా ఉన్న వారికి మాత్రమే సిగిరెట్ మానేయడం అనేది సాధ్యమవుతుంది.

తలచుట్టూ...
అయితే టర్కిష్ వ్యక్తి ఒకరు స్మోకింగ్ ను మానేయడానికి విచిత్రమైన పరిస్థితులను తనకు తానే సృష్టించుకున్నాడు. సిగిరెట్ మానేయడం అంటే తనకు సాధ్యం కాదని భావించి ఇబ్రహీం అనే వ్యక్తి సిగిరెట్ మానేయడానికి తన తలను బోనులో బంధించుకున్నాడు. దాని తాళం అతని భార్య వద్ద మాత్రమే ఉంచాడు. కేవలం భోజనం చేసే సమయంలో మాత్రమే దానిని ఓపెన్ చేసి మళ్లీ లాక్ చేస్తుంది. కుటాహ్యా నివాసి అయిన అతను తన తండ్రి ధూమపాన వల్ల క్యాన్సర్ తో మరణించిన తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీనికి ముందు రోజుకు రెండు ప్యాకెట్ల సిగిరెట్లను ఇరవై ఆరేళ్ల పాటు తాగాడు. అందుకే ఆయన ఇలా తనకు తాను శిక్షలా మార్చుకుని తలకు బోనులాంటి కవచాన్ని ఏర్పాటు చేసుకుని మానేశాడు.


Tags:    

Similar News