Ecuador : ఈక్విడార్ పై క్రిమినల్ గ్యాంగ్ లపై దాడులకు సిద్ధం

దక్షిణ అమెరికా దేశమైన ఈక్విడార్‌లో క్రిమినల్ గ్యాంగ్ లపై ఈ వారాంతంలో భారీ దాడులు చేపట్టనున్నట్టు ఆ దేశ అంతర్గత మంత్రి జాన్ రైంబర్గ్ తెలిపారు

Update: 2026-03-12 01:47 GMT

President Donald Trump greets President of Ecuador Daniel Noboa at the Shield of the Americas Summit

దక్షిణ అమెరికా దేశమైన ఈక్విడార్‌లో క్రిమినల్ గ్యాంగ్ లపై ఈ వారాంతంలో భారీ దాడులు చేపట్టనున్నట్టు ఆ దేశ అంతర్గత మంత్రి జాన్ రైంబర్గ్ తెలిపారు. ఈ ఆపరేషన్లకు అమెరికా నుంచి లాజిస్టిక్ సహాయం అందుతోందని చెప్పారు. స్థానిక రేడియోతో బుధవారం మాట్లాడిన రైంబర్గ్… గ్వాయాస్, లోస్ రియోస్, సాంటో డొమింగో డి లాస్ సాచిలాస్ ప్రావిన్సుల్లో మార్చి 15 నుంచి 30 వరకు రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ మూడు ప్రాంతాలు దేశంలో అత్యంత హింసాత్మక ఘటనలు జరిగే ప్రదేశాలుగా గుర్తింపు పొందాయని చెప్పారు. కర్ఫ్యూ సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, సైన్యం, పరికరాల రాకపోకలకు రహదారులు ఖాళీగా ఉంచాలని ఆయన కోరారు.

అమాయకులు ప్రాణాలు కోల్పోకుండా...
“మేము చేపట్టబోయే దాడుల్లో నిరపరాధులు ప్రాణాలు కోల్పోవడం మాకు వద్దు. త్వరలో ప్రారంభించే ఆపరేషన్లకు అమెరికా బలగాల నుంచి గణనీయమైన సహాయం అందుతోంది” అని రైంబర్గ్ తెలిపారు. ఈక్వడార్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని అసోసియేటెడ్ ప్రెస్ స్పందన కోరింది. అయితే వెంటనే సమాధానం రాలేదు. బుధవారం మధ్యాహ్నం స్పందించిన అమెరికా సదర్న్ కమాండ్ మాత్రం మార్చి 3న జరిగిన దాడుల తర్వాత మెరైన్ జనరల్ ఫ్రాన్సిస్ ఎల్. డోనోవన్ చేసిన వ్యాఖ్యలను మళ్లీ పేర్కొంది. “నార్కో ఉగ్రవాదులపై పోరాటంలో ఈక్వడార్ సైన్యం చూపుతున్న ధైర్యం, కట్టుబాటు అభినందనీయం” అని ఆయన అన్నారు.
భద్రతా కారణాల వల్ల...
ఈ ప్రకటనకు కొన్ని రోజుల ముందే ఈక్వడార్, అమెరికా కలిసి సంఘటిత క్రిమినల్ గ్యాంగ్ లపై సంయుక్త సైనిక చర్యలు ప్రారంభించాయి. అయితే ఆ సమయంలో ఆపరేషన్లు ఎక్కడ జరుగుతున్నాయి, ఎంత విస్తృతంగా సాగుతున్నాయి అన్న వివరాలు రెండు దేశాలు వెల్లడించలేదు. నేర ముఠాలు దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్మించుకున్న వ్యవస్థను పూర్తిగా కూల్చివేయడమే ఈ దాడుల లక్ష్యమని రైంబర్గ్ చెప్పారు. భద్రతా కారణాల వల్ల పూర్తి వివరాలు వెల్లడించలేమన్నారు.ఇదే సమయంలో ఈక్వడార్‌లో మొదటిసారి ఎఫ్‌బీఐ కార్యాలయం ఏర్పాటు చేయాలని రెండు దేశాలు అంగీకరించాయి. అమెరికా రాయబార కార్యాలయ చార్జ్ డి అఫైర్స్ లారెన్స్ పెట్రోని దీన్ని “ముఖ్యమైన మైలురాయి”గా పేర్కొన్నారు. దీంతో ఎఫ్‌బీఐ, ఈక్వడార్ పోలీసుల మధ్య కార్యాచరణ సంబంధాలు మరింత బలపడతాయని చెప్పారు.
డ్రగ్స్ మాఫియాతో సంబందాలున్న...
పోలీసుల సమాచారం ప్రకారం క్విటోలోని అమెరికా రాయబార కార్యాలయంలోనే ఈ ఎఫ్‌బీఐ కార్యాలయం పనిచేయనుంది. ఉపాధ్యక్షురాలు మారియా జోస్ పింటో ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ “నేరాలను అదుపు చేయడానికి ఇది కీలకం” అన్నారు.2021 ప్రారంభం నుంచి ఈక్వడార్‌లో సంఘటిత క్రిమినల్ గ్యాంగ్ ల దాడులు పెరిగాయి. పోలీసుల ప్రకారం ఈ ముఠాలకు కొలంబియా, మెక్సికోలోని మాదకద్రవ్య కార్టెల్‌లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ఈక్వడార్ కీలక కేంద్రంగా మారింది. ముఖ్యంగా కొలంబియా నుంచి, కొంతమేర పెరూ నుంచి వచ్చే మాదకద్రవ్యాలు ఈక్వడార్‌కు చేరుతాయి. అక్కడి సముద్ర తీర నౌకాశ్రయాల నుంచి మధ్య అమెరికా, అమెరికా, యూరప్ వంటి ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తారని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News