Israel Iran Effectg : యుద్ధం ఎఫెక్ట్.. దుబాయ్ లో పెంపుడు జంతువుల కేకలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం గల్ఫ్ దేశాలపై ప్రభావం పడనుంది. ప్రధానంగా దుబాయ్‌లో ఇప్పటికే అనేక పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. యుద్ధ వాతావరణంతో ఎయిర్ పోర్టులను కూడా మూసివేశారు. ఇప్పటికే దుబాయ్ లో చాలా మంది దుబాయ్ తో పాటు గల్ఫ్ దేశాల నుంచి బయటకు వెళుతున్నారు. యుద్ధం బారిన పడకుండా తమను తాము కాపాడుకోవడానికి ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. విమానాలు సుదీర్ఘంగా ప్రయాణం చేసి కూడా తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ఇరాన్ దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు వెళుతున్న అనేక మంది తమతో పాటు ఇన్నాళ్లు కలిసి ఉన్న పెంపుడు జంతువులను నడిరోడ్డుపై వదిలేస్తున్నారు.
స్తంభాలకకు కట్టేసి కొందరు...
యజమానులు తమ పెంపుడు జంతువులను స్తంభాలకు కట్టేసి అలాగే వెళ్ళిపోతున్నారు. ఆహారం, నీరు లేక అవి అరుస్తున్నాయి. ప్రధానంగా కుక్కలు, పిల్లులను అట్టపెట్టెల్లో పెట్టి, వాటిపై ‘‘మమ్మల్ని క్షమించండి.. వీటిని తీసుకెళ్లడం మా వల్ల కాదు’’ అని రాసి రోడ్ల పక్కన పడేస్తున్నారు. కొంతమంది ప్రవాసులు పెంపుడు జంతువులను తరలించే ఖర్చు భరించలేక వాటిని వదిలేసి వెళుతున్నారు. దీంతో వాటిని రక్షించడం కోసం జంతుప్రేమికులు రంగంలోకి దిగారు. రోడ్డు మార్గంలో ఒమన్ సరిహద్దులకు చేరుకుంటున్న వారు, అక్కడ జంతువులకు అనుమతి లేకపోవడంతో వాటిని ఎడారిలోనే వదిలి వెళుతున్నారు. భగభగమండే ఎండలో ఆహారం లేక మూగ జంతువులు అలమటిస్తున్నాయి.
జంతు సంరక్షణ కేంద్రాలు...
జంతు సంరక్షణ కేంద్రాలు కూడా ఇప్పటికే నిండిపోవడంతో కొత్తగా వచ్చే జంతువులను చేర్చుకోవడం వారికి భారంగా మారింది. రోజుకు వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని స్వచ్ఛంద సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దుబాయ్ మున్సిపాలిటీ వీధి జంతువుల కోసం ఏర్పాటు చేసిన ‘ఎహ్సాన్ స్టేషన్’ ఇప్పుడు పెరుగుతున్న ఈ సంఖ్యకు సరిపోవడం లేదు. సంపన్న దేశంలో ఇలాంటి అమానవీయ ఘటనలు జరగడం పట్ల అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పెంపుడు జంతువులు రోడ్డు మీద అరుపులతో దుబాయ్ తో పాటు ఎడాది దేశంలో అనేక ప్రాంతాల్లో వినిపిస్తుండటం జంతు ప్రేమికుల మనసులను కలచి వేస్తుంది. కానీ యుద్ధ భయంతోనే వారు వదలలేక వెళ్లిపోతున్నారని, ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు.