మిడిల్ ఈస్ట్‌లో సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా
మిడిల్ ఈస్ట్‌లో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది
మిడిల్ ఈస్ట్‌లో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో కొనసాగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈ దేశాల్లో జరగాల్సిన 12వ తరగతి బోర్డు పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసింది. సీబీఎస్ఈ విడుదల చేసిన అధికారిక సర్క్యులర్ ప్రకారం...మార్చి 12 నుంచి మార్చి 16 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడినట్లు ప్రకటించారు.
తిరిగి తేదీలను....
ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని సీబీఎస్ఈ వెల్లడించింది. ఈ సమయంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ తమ స్కూల్స్‌తో టచ్‌లో ఉండాలని సూచించారు. తాజా సమాచారం కోసం అధికారిక ప్రకటనలను ఫాలో కావాలని సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. గల్ఫ్ దేశాల్లో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు త్వరలో పరీక్షల తేదీని ప్రకటిస్తామని చెప్పారు.