ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ లో ఎయిర్ పోర్టులు, సీపోర్టులకు ఆటంకం కలగలేదని తెలిపారు.తమ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, పోరాడే దేశం అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తామని నెతన్యాహు తెలిపారు. యుద్ధంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ నెతన్యాహు ప్రకటించారు.
యుద్ధం వెనక్కుతగ్గేది లేదని...
ఇప్పటికే ఇజ్రాయిల్ - ఇరాన్ ల మధ్య యుద్ధం పదిరోజులు దాటింది. దీంతో రెండు దేశాలు ఎవరికి వారే తగ్గేది లేదని చెబుతున్నారు. యుద్ధం తామే ముగిస్తామని రెండు దేశాలు ప్రకటించుకుంటున్నాయి. అమెరికా కూడా యుద్ధాన్ని తామే ముగిస్తామని చెబుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నెతన్యాహు చేసిన వ్యాఖ్యలతో మరికొన్ని రోజులు యుద్ధం కొనసాగే అవకాశముంది.