అమెరికాలో మరో విమానం ప్రమాదం

అమెరికాలో విమాదం ప్రమాదానికి గురైంది.

Update: 2025-12-23 02:28 GMT

అమెరికాలో విమాదం ప్రమాదానికి గురైంది. టెక్సాస్‌లోని గల్వెస్టన్‌ సమీపంలో చిన్న విమానం కూలింది.వెంటనే ఘటనపై అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో తీరంలో, హ్యూస్టన్‌కు దక్షిణ తూర్పు దిశగా సుమారు 50 మైళ్ల దూరంలో ఉన్న గల్వెస్టన్‌ వద్ద సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గల్వెస్టన్‌కు వెళ్లే కాజ్‌వే బేస్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటన స్థలానికి ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారని టెక్సాస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సేఫ్టీ ‘ఎక్స్‌’లో వెల్లడించింది.

సహాయక చర్యలు ప్రారంభం...
విమానంలో ఎంతమంది ఉన్నారు? గాయాలేమైనా అయ్యాయా? అనే అంశాలపై తక్షణమే స్పష్టత రాలేదు. గల్వెస్టన్‌ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, డైవ్‌ టీమ్‌, క్రైమ్‌ సీన్‌ యూనిట్‌, డ్రోన్‌ యూనిట్‌, పట్రోల్‌ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. “ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే వెల్లడిస్తాం,” అని షెరీఫ్‌ కార్యాలయం ఫేస్‌బుక్‌లో తెలిపింది. సహాయక చర్యలు సజావుగా సాగేందుకు ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించింది. గల్వెస్టన్‌ పర్యాటకులకు ప్రసిద్ధమైన బీచ్‌ దీవిగా గుర్తింపు ఉంది.


Tags:    

Similar News