Plane Crash : మరో ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే?
లండన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సౌత్‌ఎండ్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం కుప్పకూలింది
లండన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సౌత్‌ఎండ్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే B200 విమానం కూలిపోయింది.విమానం కూలిన వెంటనే భారీ పేలుడు సంభవించింది. అయితే ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విమానం లండన్ నుంచి నెదర్లాండ్ బయలుదేరి వెళుతుంది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగించి. బీచ్ క్రాఫ్ట్ బీ 200 సూపర్ కింగ్ విమానం కావడంతో నేలమీద పడిన కొద్ది సెకన్లకే పేలిపోయింది. పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.
ఎయిర్ పోర్టుకు సమీపంలో...
అయితే టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో ఎయిర్ పోర్టుకు సమీపంలోనే కుప్ కూలిపోయింది. అయితే విమాన ప్రమాదంలో ఎంత మంది ఉన్నారన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఈ విమానం మెడికల్ ట్రాన్స్ పోర్టు జెట్ గా చెబుతున్నారు. అయితే మినీ విమానంలో అప్పడప్పుడు రోగులను కూడా తరలిస్తుంటారని, మరి ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో రోగులు ఎవరైనా ఉన్నారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకూ తెలియరాలేదు.
సాంకేతిక లోపమేనా?
టేకాఫ్ అయిన వెంటనే కుప్ప కూలిపోవడంతో సాంకేతికలోపమే కారణమయి ఉంటుందని భావిస్తును్నారు. ఈ నేపథ్యంలో సౌత్ ఎండ్ ఎయిర్ పోర్టులో పలు మానాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఎవరైనా విమానంలో ఉంటే రక్షించవచ్చని స్థానికులు ప్రయత్నించారు. ఈలోపు సహాయక బృందాలు అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదం రీతిలోనే ఈ విమానం కూడా టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిపోవడం పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.