Narendra Modi : ముగిసిన జిన్ పింగ్ తో మోదీ చర్చలు

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాని మోదీ చర్చలు ముగిశాయి

Update: 2025-08-31 08:05 GMT

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాని మోదీ చర్చలు ముగిశాయి. జిన్ పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని మోదీ సుమారు గంటపాటు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఏడు సంవత్సరాల తర్వాత ఇరు దేశాధినేతలు సమావేశమై చర్చించుకున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న సమస్యలతో పాటు అనేక అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఇరుదేశాలు కలసి నడవాలని నిర్ణయించారు.

ఏడేళ్ల తర్వాత...
తియాంజిన్ వేదికగా మోదీ -షీ జిన్ పింగ్ చర్చలు ముగిశాయి. భారత్ - చైనా మధ్య ప్రత్యక్ష విమాన రాకపోకలకు అంగీకారం సమావేశంలో తేలింది. విమాన రాకపోకలకు అంగీకారం తెలిపిన ప్రధాని మోదీ, భారత్ -చైనా సరిహద్దు నిర్వహణపై ఇరుదేశాల ప్రతినిధుల అంగీకారానికి వచ్చారు. సరిహద్దులో శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు అంగీకరించాయి. భారత్ -చైనా సంబంధాలు ఇరుదేశాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.




Tags:    

Similar News