America : అమెరికాలో కూలిన విమానం
అమెరికాలోని లూయీస్ విల్లాలో విమానం కూలిపోయింది.
అమెరికాలోని లూయీస్ విల్లాలో విమానం కూలిపోయింది. టేకాఫ్ సమయంలో ఈ ఘటన జరిగింది. కూలిపోయిన విమానం కార్గో విమానంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు. కార్గో విమానం హోనులులుకు సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరి ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు.
కార్గో విమానంగా...
విమానం గాల్లో ఉండగానే మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా కూలిపోయిందని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. వెంటనే సహాయక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.