8న ప్రధాని మోడీ- బైడెన్ సమావేశం కీలక ఒప్పందాలు..

ఢిల్లీలో సెప్టెంబర్‌ 9-10 తేదీల్లో జరగనున్న జి 20 సదస్సుకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హాజరుకున్నారు. అయితే ఈ సదస్సు జరగబోయే రెండురోజుల ముందే జో బైడెన్‌ భారత్‌కి చేరుకోనున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది.

Update: 2023-09-03 08:50 GMT

8న ప్రధాని మోడీ- బైడెన్ సమావేశం

కీలక ఒప్పందాలు..

ఢిల్లీలో సెప్టెంబర్‌ 9-10 తేదీల్లో జరగనున్న జి 20 సదస్సుకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హాజరుకున్నారు. అయితే ఈ సదస్సు జరగబోయే రెండురోజుల ముందే జో బైడెన్‌ భారత్‌కి చేరుకోనున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. సెప్టెంబర్‌ 8, శుక్రవారం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, భారత ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనున్నారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. భారత్ అధ్యక్షత వహిస్తున్న జీ-20 సమావేశాలు ఈ నెల 9,10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్నాయి.

ఈ శిఖరాగ్ర సమావేశంలో స్వచ్ఛమైన ఇంధన పరివర్తన, వాతావరణ మార్పులతో సహా ప్రపంచ దేశాల సమస్యల్ని పరిష్కరించడానికి జి 20 దేశాల భాగస్వాములతో కలిసి బైడెన్‌ చర్చించనున్నట్లు వైట్‌ హౌస్‌ పేర్కొంది.

భారత్ పర్యటనలో భాగంగా ఈనెల 7న బైడెన్ ఢిల్లీకి బయలుదేరుతారు. 8న మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 9, 10 తేదీల్లో జి 20 సమావేశాల్లో పాల్గొంటారు. అంతర్జాతీయ అంశాల్లో ఉమ్మడి కార్యాచరణ పై అందులో చర్చలు జరుగుతాయి.

శుద్ది చేసిన ఇంధనం, ఇంధన పరివర్తనం, వాతావరణం మార్పులపై పోరాటం వంటి అంశాలపై నేతలు చర్చిస్తారు. రష్యా యుద్ధం కారణంగా పడిన ఆర్థిక, సామాజిక ప్రభావాల పై కూడా చర్చలు జరుగనున్నాయి. ప్రపంచ బ్యాంకు సహా బహుళ అభివృద్ధి బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచి పేదరికంపై మరింత గట్టిగా పోరాడేందుకు కార్యాచరణను వీరిరువురి చర్చల్లో నిర్ణయిస్తారని శ్వేత సౌధం ప్రకటించింది.

Tags:    

Similar News