వామ్మో ! మరో కరోనా కొత్తవేరియంట్ గుర్తింపు

దేశంలో ప్రజలు కరోనా ఒత్తిడి నుంచి కోలుకుంటున్న సమయంలో.. మరో కరోనా కొత్త వేరియంట్ ను గుర్తించారు పరిశోధకులు. బ్రిటన్ లో..

Update: 2022-02-17 08:01 GMT

కరోనా, ఒమిక్రాన్ ల తీవ్రత ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. దేశంలో ప్రజలు కరోనా ఒత్తిడి నుంచి కోలుకుంటున్న సమయంలో.. మరో కరోనా కొత్త వేరియంట్ ను గుర్తించారు పరిశోధకులు. బ్రిటన్ లో కరోనా కొత్తరకాన్ని గుర్తించారు. ఈ రకం కేసులను డెల్టాక్రాన్ గా పిలుస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ గా, థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్ గా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ రెండు రకాలను పోలీన లక్షణాలు కనిపిస్తుండటంతో.. దానిని డెల్టాక్రాన్ గా పిలుస్తున్నారు.

నిజానికి డెల్టాక్రాన్ ను తొలిసారిగా గత డిసెంబర్ లో సైప్రస్ లో గుర్తించారు. ఆ తర్వాత ఈ తరహా కేసులు పెద్దగా నమోదుకాకపోవడంతో పట్టించుకోలేదు. తాజాగా డెల్టా, ఒమిక్రాన్ లక్షణాలు డెల్టాక్రాన్ కేసుల్లో ఉన్నట్టు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకేహెచ్ఎస్ఏ) ప్రకటించింది. ప్రస్తుతం ఈ కేసులపై పరిశోధన చేస్తున్నట్లు తెలిపింది. అయితే డెల్టాక్రాన్ ఇన్ఫెక్షన్ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదీ, లక్షణాల తీవ్రత గురించి వివరాలు వెల్లడించలేదు. డెల్టాక్రాన్ వేరియంట్ మునుపటి వేరియంట్ల కన్నా తక్కువ ప్రభావమే చూపవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News