Thu Nov 30 2023 21:57:21 GMT+0000 (Coordinated Universal Time)
నాకు కాబోయే భర్త అలా ఉండాలి : రష్మిక మందన్న
తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పకనే చెప్పింది "ఛలో" హీరోయిన్. ఎవరి దగ్గర ఉంటే మనం సురక్షితంగా ఉన్నట్లు

రష్మిక మందన్న.. ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరోయిన్లలో రష్మిక ఒకరు. ఇటీవలే విడుదలైన పుష్ప సినిమాలో రష్మిక అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రలో నటించింది. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పుష్ప తర్వాత రష్మిక నటించిన "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెల 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పకనే చెప్పింది "ఛలో" హీరోయిన్. ఎవరి దగ్గర ఉంటే మనం సురక్షితంగా ఉన్నట్లు భావిస్తామో కంఫర్ట్గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటామని అనిపిస్తుందో అతడే జీవితానికి మంచి లైఫ్ పార్టనర్ అని చెప్పింది. అలాంటి వ్యక్తినే తాను భర్తగా ఎంచుకుంటానని తెలిపింది. ఇద్దరూ సమానంగా అర్థం చేసుకుంటేనే అది ప్రేమ అవుతుందని, ఒకరు అర్థం చేసుకుని, మరొకరు అర్థం చేసుకోకపోతే అది వన్ సైడ్ లవ్ అవుతుందని రష్మిక పేర్కొంది. ఒక వేళ తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటే.. ఇంట్లో వారిని ఒప్పించాకే చేసుకుంటానని చెప్పింది.
News Summary - Heroine Rashmika Mandanna Requirements for her future husband
Next Story