కవ్వింపు చర్యలతో రెచ్చగొడుతున్న చైనా

భారత్ లోకి సొరంగ మార్గాలు, బంకర్లు పొరుగు దేశం చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ ను రెచ్చగొడుతోంది.

Update: 2023-08-30 07:09 GMT

కవ్వింపు చర్యలతో రెచ్చగొడుతున్న చైనా

భారత్ లోకి సొరంగ మార్గాలు, బంకర్లు

పొరుగు దేశం చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ ను రెచ్చగొడుతోంది. 1967లో చైనాలిబరేషన్ ఆర్మీని భారత్ ఓడించినప్పటి నుంచి ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది. భారత్ సరిహద్దు భూభాగాలైన అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయి చిన్‌లను తమవిగా పేర్కొంటూ చైనా కొత్త మ్యాప్‌ను సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా, భారత భూభాగంలో చైనా సొరంగాలు, బంకర్లు నిర్మిస్తోన్న విషయం వెలుగులోకి వచ్చింది.

మాక్సర్ టెక్నాలజీస్ ఛాయ చిత్రాలు

ఉత్తర లడఖ్‌లోని దెప్సాంగ్ మైదానానికి తూర్పున అరవై కిలోమీటర్ల దూరంలో సైనికులు, ఆయుధాల కోసం బహుళ పటిష్ట ఆశ్రయాలు, బంకర్ల నిర్మాణానికి చైనా దళాలు ఇరుకైన నదీ లోయతో పాటు కొండపైకి సొరంగాలు, భూగర్భ పనులు ప్రారంభించినట్టు అమెరికాకు చెందిన మాక్సర్ టెక్నాలజీస్ సంస్థ విడుదల చేసిన ఉపగ్రహ ఛాయా చిత్రాలు వెల్లడిస్తున్నాయి. డిసెంబర్‌ 2021 నాటి అక్సాయ్‌చిన్‌ రీజియన్‌ ఫోటోలు.. ఈ ఏడాది ఆగస్టు 18న అదే రీజియన్‌లో పలు నిర్మాణాలతో కూడిన ఫోటోలను మాక్సర్ విడుదల చేసింది. అంతర్జాతీయ భౌగోళిక- ఇంటెలిజెన్స్ నిపుణులు ఈ ఫోటోలను విశ్లేషించి నివేదికను విడుదల చేశారు. వాస్తవాధీన రేఖకు తూర్పున చైనా అక్రమించుకున్న చారిత్రకంగా భారత్ భూభాగామైన ఆక్సాయి చిన్‌ను ఈ నివేదికలో గుర్తించారు.

ఈ ఫోటోలు గత కొన్ని నెలలుగా చైనా భారీ నిర్మాణ కార్యకలాపాలను వెల్లడిస్తున్నాయి. ఈ నిర్మాణాలు భారత్ వైమానిక, ఫిరంగిదళ దాడుల నుంచి చైనా సైనికులను, ఆయుధాలను రక్షించే విధంగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను చైనా కొత్త ప్రామాణిక మ్యాప్‌‌లో చేర్చడంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మండిపడ్డారు.

మరోవైపు, చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) చేపట్టిన దీర్ఘశ్రేణి నిఘా రాడార్లతో కూడిన మిలటరీ మౌలిక సౌకర్యాల విస్తరణ, భూగర్భ నిర్మాణాలు, దాదాపు 250 హెక్టార్ల విస్తీర్ణంలో రహదారులు, నిర్మాణంలో ఉన్న పలు నిర్మాణాలు మాక్సర్‌ శాటిలైట్‌ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నిర్మాణాలన్నీ వాస్తవాధీన రేఖకు కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం.

భారత్ దూకుడుగా వ్యవహరించడంతో చైనా అక్సాయ్ చిన్‌లో ఇటువంటి చర్యలకు దిగినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ భారతీయ డ్రోన్ స్టార్టప్ న్యూస్పేస్ రిసెర్చ్ అండ్ టెక్నాలజీస్ సీఈఓ సమీర్ జోషి ‘గాల్వాన్ ఘర్షణ తర్వాత భారత సైన్యం యుద్ధ సామాగ్రిని ముఖ్యంగా దీర్ఘ-శ్రేణి ట్యూబ్, రాకెట్ ఆర్టిలరీలను సరిహద్దుల్లో మోహరించింది. చైనా చేపట్టిన నిర్మాణాలు భారత దాడి సామర్థ్యంతో నేరుగా ముడిపడి ఉన్నాయని అని వారు చెబుతున్నారు.

టిబెట్ ను చైనా ఆక్రమించకుండా అడ్డుకోవడంతోపాటు, దలైలామాకు ఆశ్రయం ఇవ్వడం వంటివి 1960వ శతాబ్దం నుంచి ఆదేశానికి భారత్ పై కసిని పెంచుతోంది. చైనా విస్తరణ కాంక్షను భారత్ అడ్డుకోవడంలో భాగంగా పటిష్ట షెల్టర్‌లు, బంకర్‌లు, సొరంగాలు, రోడ్ల విస్తరణతో సహా భారీ నిర్మాణ కార్యకలాపాలు జరపడం కూడా చైనాకు కంటకింపుగా ఉంది.

శాటిలైట్లప్రయోగంతో వెల్లడైన చైనా కుయుక్తి

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా, వాతావరణం, కమ్యూనికేషన్ల కోసం భారత్ పంపిన పీఎస్ ఎల్వీ శాటిలైట్లు తీసిన ఫోటోల కారణంగా భారత్ సరిహద్దు వెంట చైనా భారీగా ఆయుధాలు మోహరించినట్లు తెలిసింది. దీంతో ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశాలతో భారత రక్షణ రంగం, డీఆర్ డీవో, మిలటరీ సంయుక్తంగా యుద్దప్రాతిపదికన భూ ఉపరితలం నుంచి ఉపరితలంలోకి వెళ్లే మిస్సైళ్లను రూపొందించింది. దీనికి మిస్సైల్ ఉమెన్, అగ్నిపుత్రి టెస్సీ థామస్ సారధ్యం వహించారు.

ప్రస్తుతం మన దగ్గర సూపర్ సోనిక్ (శబ్దవేగంతో ప్రయాణించే), హైపర్ సోనిక్ మిస్సైళ్లు (శబ్దవేగాన్ని మించి ప్రయాణించే)ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే సూపర్ క్రూయిజ్ బ్రహ్మోస్ మిస్సైల్ ను భారత త్రివిధ దళాలు రష్యాతో కలసి రూపొందించాయి.

Tags:    

Similar News