లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పై నిషేధం
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా కెనడా ప్రకటించింది
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా కెనడా ప్రకటించింది. దీంతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ను తమ దేశంలో ఏరివేయాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది. కెనడా పోలీసులు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కోసం దేశం నలుమూలల వెతుకుతున్నారు కెనడా ప్రభుత్వం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన తర్వాత గ్యాంగ్ సభ్యుల కోసం వేట ప్రారంభించారు.
ఉగ్రవాద సంస్థల జాబితాలో...
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ భయానక వాతావరణం సృష్టించి, ప్రజలను బెదిరింపులకు గురి చేస్తుందని కెనడా ప్రభుత్వం పేర్కొంది. ఇలాంటి వాటికి ఊరుకునేది లేదని క్రిమినల్ కోడ్ ప్రకారం ఈ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. కెనడాలో ఈ గ్యాంగ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.