హాంకాంగ్ లో తీవ్ర విషాదం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
హాంకాంగ్ లో జరిగిన భారీ అగ్నిప్రమాద మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
హాంకాంగ్ లో జరిగిన భారీ అగ్నిప్రమాద మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 44 మంది చనిపోగా, 279 మంది గల్లంతయియినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మృతిచెందిన వారిలో ఒకరు అగ్నిమాపక సిబ్బంది ఉన్నట్లు వెల్లడించింది. శిథిలాల్లో చిక్కుకున్న వందల మందిని కాపాడి ఆస్పత్రులకు తరలించారు.
గల్లంతయిన వారు...
దాదాపు 900 మందిని తాత్కాలిక షెల్టర్లకు పంపించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక నివాస సముదాయంలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇందులో రెండు వేల ఇళ్లు ఉన్నాయని, మొత్తం ఏడు అపార్ట్ మెంట్లలో 4,800 మంది ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.