కూకట్ పల్లిలో కల్తీ కల్లు - ముగ్గురి మృతి

హైదరాబాద్ కూకట్ పల్లిలో కల్తీ కల్లు తాగిన వారిలో ముగ్గురు మరణించారు

Update: 2025-07-09 06:53 GMT

హైదరాబాద్ కూకట్ పల్లిలో కల్తీ కల్లు తాగిన వారిలో ముగ్గురు మరణించారు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో కల్తీ కల్లు తాగి పదిహేను మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదర్ నగర్, కూకట్ పల్లి, నడిగడ్డ తండా, కే.పీ.హెచ్.బీ ప్రాంతాల నుంచి వచ్చిన పదిహేను మంది ఈ కల్తీ కల్లును తాగినట్లు అధికారులు చెబుతున్నారు.

ఆసుపత్రిలో చేరి...
ఆదివారం ఉదయం కల్లు తాగినా సోమవారం ఉదయం నుంచి విరేచనాలు, వాంతులతో అవస్థలు పడుతుండటంతో కుటుంబ సభ్యులు హైదర్ గూడలోని రాందేవ్ రావ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇందులో చికిత్స పొందుతూ ముగ్గురు మరణించినట్లు పోలీసులుత తెలిపారు. కల్లీ కల్లు అమ్ముతున్నారని తెలిసి వెంటనే ఎక్సైజ్ అధికారులు హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, శంషీగూడలోని మూడు కల్లు దుకాణాలను సీజ్ చేశారు.


Tags:    

Similar News