Harish Rao : కుమ్మక్కుతోనే జలవివాదాల కమిటీ సమావేశం

ఢిల్లీలో జరుగుతున్న జలవివాదాల కమిటీ సమావేశంపై మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2026-01-30 08:09 GMT

ఢిల్లీలో జరుగుతున్న జలవివాదాల కమిటీ సమావేశంపై మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరుకు మాత్రమే కమిటీ సమావేశమవుతుందని, పోలవరం - నల్లమల సాగర్ పరిష్కారం కోసమే సమావేశాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. అసలు ఈ జలవివాదాల కమిటీకి అంగీకరించవద్దని తాను ఎప్పుడో చెప్పానని, అయినా కమిటీ కోసం ఒప్పుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందని అన్నారు.

సుప్రీంకోర్టులో చెల్లని పిటీషన్ వేసి ...
సుప్రీంకోర్టులో చెల్లని పిటీషన్ వేసి రిట్ ను వాపస్ తీసుకున్నారని, రెండు వందల టీఎంసీల గోదావరి జిలాలు ఏపీకి తరలించకపోయే కుట్ర జరుగుతుందని హరీశ్ రావు అన్నారు. తాను ప్రశ్నించిన తర్వాత వ్యతిరేకిస్తున్నట్లు కేంద్రానికి లేఖ ఈ ప్రభుత్వం రాసిందన్న హరీశ్ రావు అయితే పరోక్షంగా రేవంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నానని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాలని చూస్తున్నారని, దీనిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తామని హరీశ్ రావు హెచ్చరించారు.


Tags:    

Similar News