ఆకట్టుకుంటున్న వింగ్స్ ఇండియా షో

హైదరాబాద్ లో జరుగుతున్న ఆకట్టుకుంటున్న వింగ్స్ ఇండియా షో అలరిస్తుంది

Update: 2026-01-31 04:20 GMT

హైదరాబాద్ లో జరుగుతున్న ఆకట్టుకుంటున్న వింగ్స్ ఇండియా షో అలరిస్తుంది. హైదరాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్‌పోర్టులో ‘వింగ్స్ ఇండియా-2026’ ప్రదర్శన నేటితో ముగియనుంది. మూడోరోజైన శుక్రవారం ఉత్సాహంగా కొనసాగింది. సాధారణ ప్రజలకు అనుమతితో పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చి ఎయిర్‌షోలు, ఏరోబాటిక్ డిస్‌ప్లేలు, ఎగ్జిబిషన్లను ఆస్వాదించారు.

భారీగాప్రజలు వచ్చి...
భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్, యూకేకు చెందిన గ్లోబల్ స్టార్స్ ఏరోబాటిక్ టీమ్ అద్భుతమైన విన్యాసాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సాయంత్రం గాయని ఉషా ఉతుప్ సంగీత ప్రదర్శనతో సందడి నెలకొంది. శుక్రవారం దాదాపు 9 నుంచి 10 వేల మంది ప్రజలు ఈ ప్రదర్శనను వీక్షించారు. నేటితో ఎయిర్‌షో ముగియనుంది.


Tags:    

Similar News