Gold Prices Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్... ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి
పెరుగుట విరుగుట కొరకే అంటారు. బంగారం, వెండి ధరలు అంత భారీగా స్థాయిలో పెరిగితే అంతే స్థాయిలో పతనమవుతాయి. ఏ వస్తువుకైనా ధరలు తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధరలు పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. బంగారం ధరలు పెరిగాయి కాబట్టి బంగారం, వెండి కొనుగోలు చేసేవారు కూడా లేరు. దీంతో బంగారం ధరలు దిగి రావడం తప్పదు. ధరలు పెరగడంతో ఒక్కసారిగా తమ వద్ద ఉన్న బంగారం, వెండి వస్తువులను అమ్మేసి సొమ్ము చేసుకునే వారు ఎక్కువగా ఉన్నారు. అదే సమయంలో పెట్టుబడి పెట్టే వారు కూడా అధికంగానే ఉన్నారు. ధరలు ఒక్కసారి పతనం కావడంతో ఇక బంగారం, వెండి ధరలు రానున్న రోజుల్లో మరింత పతనమయ్యే అవకాశాలున్నాయన్నది మార్కెట్ నిపుణుల అంచనా.
ఎన్నడూ లేనంతగా...
అలాగే, 2025లో బంగారం ధరల్లో ఎన్నడూ లేనంతగా ర్యాలీ స్పష్టంగా కనిపించింది. ఫలితంగా, ఒక్క ఏడాదిలోనే 60 శాతానికి పైగా పెరిగింది. 1979 తర్వాత బంగారం ధరల్లో ఇంత భారీ వార్షిక పెరుగుదల నమోదు కావడం గత ఏడాదే మొదటిసారి.బంగారం ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి, అయితే అవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరుగుతోంది._పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడం కంటే సంప్రదాయ ఆస్తులలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
గత నాలుగైదు రోజుల నుంచి...
గత కొద్ది రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. భారీగా ధరలు పెరిగి అంతే స్థాయిలో పతనమవుతున్నాయి. అయినా ఇప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,47,200 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 160,580 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 3,20,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపించవచ్చు.