Hyderabad : కోఠిలో కాల్పులపై ఘటన ఇలా?
కోఠి లో జరిగిన కాల్పుల ఘటనపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడారు.
కోఠి లో జరిగిన కాల్పుల ఘటనపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడారు. కోఠి లోని ఎస్బిఐ ఏటీఎం లో నగదు డిపాసిట్ చేయడానికి రషీద్ అనే వ్యక్తి వచ్చాడన్నారు. ఉదయం 6.50 గంటల నుండి ఏడు గంటల మధ్యలో దుండగులు కాల్పులు జరిపారని డీసీపీ తెలిపారు. రషీద్ డబ్బులు డిపాజిట్ చేయడం పై రికీ నిర్వహించి దాడి చేసినట్లు తెలుస్తోందన్నారు.
నాంపల్లికి చెందిన...
రషీద్ నాంపల్లి కి చెందిన బట్టల వ్యాపారి అని, ఆరు లక్షలు డిపాజిట్ చేయడానికి వచ్చారని చెప్పారు. రషీద్ పై కాల్పులు జరపడం తో అక్కడే కుప్పకులాడని, అతను తెచ్చిన 6లక్షల నగదు,రషీద్ కు చెందిన బైక్ తో దుండగులు పరారయ్యారని ఏసీబీ మీడియాకు వివరించారు. 5టీమ్ లతో దుండగులను,సీసీ టివి ఫుటేజ్ ద్వారా గాలిస్తున్నామని, రషీద్ కు ప్రాణపాయం లేనట్లు వైద్యులు నిర్దారించారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.