ఐదురోజుల్లో ఎన్ని వాహనాలు జాతీయ రహదారిపై వెళ్లాయంటే?

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై దాదాపు మూడు లక్షల వాహనాలు ప్రయాణించినట్లు టోల్ గేట్ నిర్వాహకులు తెలిపారు

Update: 2026-01-15 08:54 GMT

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై దాదాపు మూడు లక్షల వాహనాలు ప్రయాణించినట్లు టోల్ గేట్ నిర్వాహకులు తెలిపారు. ఐదు రోజుల్లో సంక్రాంతి పండగకు వెళ్లిన వాహనాలు మూడు లక్షలని పంతగి టోల్ ప్లాజా నిర్వాహకులు తెలిపారు. ఈసారి సంక్రాంతికి వారం రోజులకు పైగానే సెలవులు రావడంతో అందరూ సొంతూళ్లకు బయలుదేరి వెళ్లారు.

టోల్ ప్లాజా వద్ద...
ఒక్క పంతంగి టోల్ ప్లాజా వద్దనే 3.04 లక్షల వాహనాలు దాటినట్లు చెబుతన్నారు. శుక్రవారం నుంచి మొదలయిన వాహనాల రద్దీ బుధవారం వరకూ కొనసాగుతూనే ఉంది. ఈ మూడు లక్షల వాహనాల్లో రెండు లక్షల వాహనాలు విజయవాడ వైపునకు వెళ్లాయని తెలిసింది. గత ఏడాది రెండు లక్షల వాహనాలు మాత్రమే వెళ్లాయి. ఈసారి గత ఏడాది కంటే ఎక్కువగా వాహనాలు ఎక్కువగా బయలుదేరి వెళ్లనున్నాయి.


Tags:    

Similar News