Gold Rates : గుడ్ న్యూస్.. గోల్డ్ రేట్స్ తగ్గాయ్.. ఎంతో తెలుసా?

బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి

Update: 2026-02-26 07:09 GMT

బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై 210 రూపాయలు తగ్గింది. దీంతో పెళ్లిళ్ల సీజన్ సమయంలో కొంత ధర తగ్గడంతో వినియోగదారులకు ఊరట అని చెప్పాలి. గత రెండు, మూడు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు పతనమవతుండటం శుభపరిణామమేనని అంటున్నారు.

ధరలు నేడు...
పెళ్లిళ్ల సీజన్ లో బంగారు నగలు కొనుగోళ్లు అధికమవుతాయని కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్ 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,48,200 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,61,680 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర ప్రస్తుతం 2,85,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News