Hyderabad : ఎల్బీనగర్ వెళ్లే వారికి అలెర్ట్.. అటువైపు వస్తే ఇక అంతే
హైదరాబాద్ నగరంలో ఎల్బీ నగర్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్ నగరంలో ఎల్బీ నగర్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి. అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులతో ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్ లలో భారీగా జనం వస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు బస్సులతో పాటు కార్లు, ప్రయివేటు వెహికల్స్ అన్నీ ఎల్.బి.నగర్ నుంచి వెళుతుండటంతో ఎక్కువ మంది ఎల్బీనగర్ కు చేరుకుంటున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే రకమైన పరిస్థితి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
బంపర్ టు బంపర్ ట్రాఫిక్...
దీంతో ఎల్బీనగర్ ప్రాంతం వాహనాలు, ప్రజలతో రద్దీ పెరిగింది. ఎల్బీనగర్ వద్ద బంపర్ టు బంపర్ ట్రాఫిక్ నెలకొంది. విజయవాడ వెళ్లే ప్రయాణికులందరూ ఇటువైపు వచ్చి బస్సులు ఎక్కాల్సి ఉండటంతో ఈ ప్రాంతమంతా ట్రాఫిక్ లో చిక్కుకుంది. పోలీసులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. అయితే ఎంతగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. అందుకే ఎల్బీనగర్ వైపు వచ్చే ప్రయాణికులు తమ సొంత వాహనాలున్న వారు ఔటర్ రింగ్ రోడ్డు మీద నుంచి వెళ్లడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.