Breaking : కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది

Update: 2025-04-03 05:34 GMT

కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేసింది. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. అక్కడకు వెళ్లి సందర్శించి తమకు మధ్యంతర నివేదికను సమర్పించాలని కోరింది. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలలోపు నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రార్ ను ఆదేశించింది.

మధ్యంతర నివేదిక ...
కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమయిందని, ఇందుకోసం భూమిని చదును చేస్తున్నారని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అప్పటి వరకూ చెట్ల నరికివేతను ఆపాలని ఆదేశించిన సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ ఉండటంతో దీనిపై ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News