సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి సందర్భంగా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దాదాపు పదకొండు ప్రత్యేక రైళ్లను సంక్రాంతి పండ కోసం దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది. జనవరి 10,12,17,19 తేదీల్లో విశాఖ నుంచి చర్లపల్లి వరకూ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు ప్రకటించారు.
ప్రత్యేక రైళ్లు....
జనవరి 11,13,18,20 తేదీల్లో చర్లపల్లి నుంచి విశాఖకు రైలు ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమయిందని అధికారులు వెల్లడించారు. జనవరి18న రాత్రి అనకాపల్లి నుంచి వికారాబాద్‌కు రైలు ఉంంటుంది. అన్ని రైళ్లు ప్రయాణికులతో రద్దీగా ఉండటంతో సుఖవంతమైన ప్రయాణం కోసం దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది.