ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ సోదాలు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచింది

Update: 2025-09-03 12:15 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ లోని గచ్చి బౌలిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించిన ఆఫీసులో సిట్ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. ఈషా ఇన్ ఫ్రా కంపెనీలో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఈ సోదాలను నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ లో పలు సంస్థల్లో...
భీమ్ స్పేస్ సంస్థలకు బదులు ఈషా ఇన్ ఫ్రా కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కాజాగూడ చిరునామాలో ఈ సంస్థ ఉందని తెలిసిన సిట్ అధికారులు ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. ఈషా ఇన్ ఫ్రా కంపెనీలో డైరెక్టర్లుగా సజ్జల భార్గవ రెడ్డి, ప్రద్యుమ్నలు ఉన్నారు. కాజాగాడలోని కంపెనీతో పాటు ప్రశాంత్ నగర్ లోని కార్యాలయాల్లోనూ సిట్అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News