Gold Prices Today : భారీగా పసిడి పతనం.. వెండి ధరలు అందుబాటులోకి

ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. వెండి ధరలు కూడాభారీగా తగ్గాయి

Update: 2026-03-22 03:12 GMT

బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఇటు బంగారం, అటు వెండి ధరలు భారీగా తగ్గుతుండటం వినియోగదారులకు ఊరట కల్గించే అంశమే. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ లో కొనుగోలు చేసే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం మూఢమి నడుస్తుంది. జూన్ తర్వాత మంచి ముహూర్తాలున్నాయని చెబుతున్నారు. ముందుగా పెళ్లిళ్లు, శుభకార్యాలకు సంబంధించిన ముహూర్తాలు ఫిక్స్ అయిన వారు తమకు కావాల్సిన బంగారం, వెండి ఆభరణాలను ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.

కస్టమర్లతో కళకళ...
మరొకవైపు ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో కొందరు ముందుగానే కొనుగోలు చేయడానికి జ్యుయలరీ దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. ఇప్పటి వరకూ ధరలు భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ఒక్కసారిగా దిగివస్తుండటంతో ఇప్పుడు కొనుగోలుచేయడానికి సరైన సమయం అని భావిస్తున్నారు. అందుకే జ్యుయలరీ దుకాణాలు కస్టమర్లతో గతంలో ఎన్నడూ లేని విధంగా కళకళలాడుతున్నాయి. వ్యాపారులు కడా తమ బిజినెస్ కళకళలాడుతుండటంతో ఉత్సాహంతో అవసరమైన రాయితీలను, ఆఫర్లను ప్రకటిస్తూ అమ్మకాలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
నేటి ధరలు...
మదుపుదారులు తాము పెట్టిన పెట్టుబడులు వెనక్కు తీసుకోవడం వల్లనే ఈ భారీ తగ్గుదల అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డాలర్ బలపడటం కూడా తగ్గుదలకు ఇదే కారణమని అంటున్నారు. ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. వెండి ధరలు కూడాభారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర 2,940 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై పది వేల రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,33,800 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,45,970 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,50,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News