Telangana : నేడు అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు

భారతీయ జనతా పార్టీ నేడు ఆందోళనకు దిగనుంది.

Update: 2026-03-23 04:03 GMT

భారతీయ జనతా పార్టీ నేడు ఆందోళనకు దిగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయకోవడంపై అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్ల నుంచి వైఫల్య పాలన కొనసాగిస్తుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుందని బీజేపీ ఆరోపిస్తుంది.

భారీగా పోలీసులు...
ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రజలను మోసం చేసిందని, వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు నిచ్చింది. దీంతో అసెంబ్లీ ప్రాంగణం వద్ద భారీగా పోలీసులను మొహరించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు వివిధ చోట్ల పోలీసులు భారీగా ఉన్నారు.


Tags:    

Similar News